Telugu Hymn

ఈ సంఘం పునాది


1. ఈ సంఘం పునాది
క్రీస్తే సాధీశుఁడే
దక్కించె యేసు దీని
వాక్కాపుల్ రెట్టించే
పై నుండి వచ్చి యేసు
పెండ్లాడె నీమెనే
కోరుచు రక్త మిచ్చి
కొనె నీ కన్యనే


2. ఒక్కఁడే దేవుఁడిందు
ఒక్క విశ్వాసము
ఒక్కటే జన్మ మిందు
ఒక్క కుటుంబము
ఒక్క ప్రసాద విందు
ఒకే సునామము
నిరీక్షణొక్క టిందు
నిరంత ప్రాప్తికే


3. అసత్య మార్గమంచు
అనేకుల్ నవ్వినన్
విభాగ మై శ్రమంబుల్
విశేష మొందినన్
సుభక్తుల్ వేడుచుంద్రు
అభయ కాంతికై
యీ నింద లెల్లఁ బోయె
ఆనంద నాటికై


4. కఠిన దుఃఖ బాధల్
కల్గిన నోర్చుచు
విభ వానంద ప్రాప్తి
లభింపఁ గోరుచు
ఆ స్వర్గ పంక్తిఁజేరి
యానంద మొందుచున్
యీ సంఘ మేసుఁ గూడి
విశ్రాంతి బొందును

 


ఉన్నట్టు నేను వచ్చెదన్‌


1. ఉన్నట్టు నేను వచ్చెదన్ – పాపినైన నన్ పిల్వగన్ నీ నెత్రుచేత గడుగుమా – యో గొఱ్ఱెపిల్ల దేవుడా.


2. ఉన్నట్టు నేను వచ్చెదన్ – నే నొప్పుకొందు దప్పులన్ నీ మాటలతో హరించుమా – యో గొఱ్ఱెపిల్ల దేవుడా.


3. ఉన్నట్టు నేను వచ్చెదన్ – దుఃఖంబు బాధపర్చగన్ పాపంబు బాయ నీయొద్ద – యో గొఱ్ఱెపిల్ల దేవుడా.


4. ఉన్నట్టు నేను – వచ్చెదన్ – కబోధినై నేనుండగన్ ఆత్మీయ దృష్టి నీయుమా – యో గొఱ్ఱెపిల్ల దేవుడా.


5. ఉన్నట్టు నేను వచ్చెదన్ – నీ మాట నమ్మునట్టి నన్ మన్నించి చేర్చుకొనయా – యో గొఱ్ఱెపిల్ల దేవుడా.


6. ఉన్నట్టు నేను వచ్చెదన్ – నీ ప్రేమ నన్ను పిల్వగన్ నీవాడనౌదు సర్వదా – యో గొఱ్ఱెపిల్ల దేవుడా.


1. Unnattu nenu vacchedan – paapinaina nan pilvagan Nee netrucheta gaduguma – yo gorrepilla devuda.


2. Unnattu nenu vacchedan – ne noppukondu dappulan Nee maatala to harinchuma – yo gorrepilla devuda.


3. Unnattu nenu vacchedan – duhkhamu baadaparchagan Paapambu baya neeyodda – yo gorrepilla devuda.


4. Unnattu nenu vacchedan – kabodhinai nenundagan Atmiya drishti neeyuma – yo gorrepilla devuda.


5. Unnattu nenu vacchedan – nee maata nammunatti nan Manninchi cherchukonaya – yo gorrepilla devuda.


6. Unnattu nenu vacchedan – nee prema nannu pilvagan Neevadanaudu sarvada – yo gorrepilla devuda.

 


ఎంత పాపినైనను


1. ఎంత పాపినైనను – యేసు చేర్చుకొనును
అంచు నీ సువార్తను – అంతట జాటించుడి


పల్లవి :
హల్లెలూయ – హల్లెలూయ ఎంత పాపినైనను
యేసు చేర్చుకొనున-టంచు ప్రకటించుడి


2. మెండుగా క్షమాపణన్ – పూర్ణ సమాధానము
నెంత పాపికైన దా-నిచ్చి చేర్చుకొనును


3. తన దివ్యసిల్వచే – దీసి పాపశాపమున్
నన్ పవిత్రపర్చును – నాకు హాయి నిచ్చెను


4. ఘోర పాపినైనను – నన్ను జేర్చుకొనును
పూర్ణశుద్ధి నిచ్చును – స్వర్గమందు చేర్చును


1. Enta paapinainanu yesu cherchukonunu
Anchu nee suvaartanu anthata jaatinchudi


Chorus :
Halleluya – Halleluya enta paapinainanu
Yesu cherchukonuna tanchu prakatinchudi


2. Menduga kshamapanan poorna samadhanamu
Nenta paapikaina da nicchi cherchukonunu


3. Tana divya silvache deesi paapashaapamun
Nan pavitraparchunu naaku haayi nicchenu


4. Ghora paapinainanu nannu cherchukonunu
Poorna shuddhi nicchunu swargamandu cherchunu

 


ಮೆಜುನ್ ರಾವ್ ಬೆಸಾಂವಾಂ